Saturday, April 20, 2024

టీఆర్ఎస్ లో చేరేందుకు దుద్దిళ్ల సిద్ధం.. గేట్లు తెరవడం లేదన్న పుట్టమదు

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీని వీడుతానంటూ చెప్పిన స్టేట్ మెంట్ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. రాజీనామా తర్వాత ఆయన దారెటు అన్నది సస్పెన్స్ గా మారింది. జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఉన్నవారు కూడా టీఆర్ఎస్ వైపే చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తెలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి శ్రీధర్‌బాబు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్‌ గేట్లు తెరవడం లేదన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని, శ్రీధర్‌బాబు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలను గ్రహించి చెంచాగిరీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. మధు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, 2018 ఎన్నికల్లో పుట్టమధుపై కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన శ్రీధర్ బాబు గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement