Thursday, April 25, 2024

Armoor: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకు ప్రమాదం.. కౌన్సిల‌ర్ కు గాయాలు

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ కి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ రహదారిపై ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా వెళ్లున్న ఎమ్యెల్యే కాన్వాయ్ ని బీఆర్ఎస్ కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో కౌన్సిలర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాద ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement