Monday, January 30, 2023

పీయూష్ గోయల్ ను వెంటనే బర్తరఫ్

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో కేంద్రం ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ,తెలంగాణ రైతుల పట్ల విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మంత్రి పీయూష్ గోయల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పీయూష్ గోయల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ రైతులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అన్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ మంత్రుల బృందానికి సమయం ఇవ్వకుండా తిప్పారని మండిపడ్డారు. రైతులను తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచి మాట్లాడిన కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని, రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement