Monday, November 11, 2024

Mistery Death – రైలు పట్టాలపై బిఆర్ఎస్ నేత దాస‌రి ల‌క్ష్మారెడ్డి మృత‌దేహం..

శంకరపల్లి (ప్రభ న్యూస్) అనుమానాస్పద స్థితిలో దాసరి లక్ష్మారెడ్డి మృతి చెందిన సంఘటన శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మాజీ ఎంపీపీ ఏఎంసీ మాజీ చైర్మన్ దాసరి లక్ష్మారెడ్డి(67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన జరిగింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని అల్లీపూర్ ఆయన స్వంత గ్రామం, శుక్రవారం రైలు పట్టాలపై పడి ఉన్న ఆయన శవాన్ని చూసి స్థానికులు కొందరు రైల్వే స్టేషన్లో సమాచారం ఇవ్వగా, శంకర్ పల్లి రైల్వే అధికారులు రైల్వె పోలీసులకు సమాచారం ఇవ్వగా వికారాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పంచనామా నిమిత్తం వికారాబాద్ కు తరలించారు,

మృతుడు తన టాటా నెక్సాన్ కారుని శంకర్పల్లి పార్కింగ్ లో పార్కు చేసి ఉంది, మృతుడు దాసరి లక్ష్మారెడ్డి ది హత్యనా ఆత్మహత్యనా ఇంకా నిర్ధారణ కావలసి ఉంది., ఆయనకు భార్య అనిత ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన అల్లుడు డాక్టర్ గా కొనసాగుతున్నాడు, ఆయన స్వగ్రామానికి రెండు మార్లు సర్పంచ్ గా జహీరాబాద్ ఎంపీపీగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేయడంతో ఆయన రాష్ట్రస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందాడు, ఆయన ప్రస్తుతం డీసీఎంఎస్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు, ఆయన మృతి అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చినట్లు అయింది. హైదరాబాదులో నివాసముండే ఆయన శంకరపల్లి వరకు వచ్చి రైల్వే స్టేషన్లో ఆయన కారును పార్క్ చేయడం వలన ఆయనది హత్యనా, ఆత్మహత్యనా అని తెలియ రావడం లేదు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement