Saturday, April 20, 2024

రామప్ప దేవాలయంలో కేక్ కట్ చేసిన మంత్రి

కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా 800 ఏళ్లక్రితం నిర్మించిన రామప్ప (రుద్రేశ్వరా) దేవాలయానికి ప్రపంచ స్థాయి (యునెస్కో) గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, తదితరులు రుద్రేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంరతం అక్కడ కేక్ కట్ చేశారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడంతో దేవాలయ పరిసర ప్రాంతాలు అన్ని తిరిగి పరిశీలించారు. రామప్ప చెరువు వద్ద మత్తడి ప్రాంతానికి వెళ్లి వరదని నియంత్రించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి సత్యవతి ఆదేశించారు. యునెస్కో నిబంధనల మేరకు దేవాలయాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

తెలంగాణలో ఉండే కాకతీయుల కట్టడాలకు ప్రపంచ గుర్తింపు తెచ్చే ప్రయత్నం సీఎం కేసిఆర్ ఉద్యమ కాలం నుంచే చేశారని తెలిపారు. నేడు దానికి ఫలితం లభించిందన్నారు. కాకతీయులు కట్టిన అద్భుతమైన శిల్ప సంపద తెలంగాణలో ఉందన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు, రైతాంగం కోసం కాకతీయులు కట్టిన చెరువులను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ పేరుతో సీఎం కేసిఆర్ మహా కార్యక్రాన్ని చేపట్టారని గుర్తు చేశారు. యునెస్కో గుర్తింపు వల్ల పురాతత్వ శాఖ పరిధిలో ఈ దేవాలయం అద్భుతంగా అభివృద్ది జరుగుతుందన్నారు. దీనికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రామప్ప పరిసర ప్రాంతాలని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. రామప్పకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement