Monday, October 7, 2024

RR: యూత్ సమ్మిట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్..

కొత్తూరు, సెప్టెంబర్ 21(ప్రభ న్యూస్) : కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలోని చేగూరు రోడ్డు వద్ద శనివారం రాష్ట్ర ఇరిగేషన్, ఫుడ్, సివిల్ సప్లైస్ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

నందిగామ మండల పరిధిలోని చేగూరు కన్హా శాంతి వనంలో నిర్వహించిన యూత్ సమ్మిట్ కార్యక్రమానికి రాష్ట్ర ఇరిగేషన్, ఫుడ్, సివిల్ సప్లైస్ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తుండగా కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలోని చేగూరు రోడ్డు వద్ద షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున హాజరై మంత్రికి పుష్పగుచ్చాన్ని అందచేసి ఘనంగా స్వాగతం పలికారు.

- Advertisement -

అనంతరం తిమ్మాపూర్ నుండి కన్హా శాంతి వనంలో నిర్వహించే కార్యక్రమానికి వాహనాల్లో ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement