Thursday, August 5, 2021

కురుక్షేత్ర యుద్ధంలో ఈటెల పాత్ర ఏంటో ?

మాజీ మంత్రి ఈటెల సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కు ఈటెలకు ఆరేళ్లుగా గ్యాప్ ఉంటే మంత్రి పదవి ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఈటెల ఎక్కడ ఉండే వారు అని అడిగారు. ఈటెలపై నమ్మకంతో ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. హరీష్ రావు ను కాదని ఈటెలకు ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారన్నారు. ఈటెల తనంతట తాను చేసి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటెల బీజేపీలో ఎందుకు చేరుతున్నారని చెప్పాలని డిమాండ్ చేశారు. వరవరరావు ను జైల్లో పెడితే కేసీఆర్ పరామర్శించలేదన్న ఈటెల… ఆయను జైల్లో పెట్టిన పార్టీలో ఎందుకు చేరుతున్నారని నిలదీశారు. కేసీఆర్ చేసిన తప్పు ఏంటో ఈటెల రాజేందర్ చెప్పాలన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా టీఆరెస్ పార్టీ, కేసీఆర్ లేకుండా ఈటెల పేరుమీద గెలిచారా? అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు.

హుజురాబాద్ లో అభివృద్ధి చేసే పార్టీకి అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు పోటీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరించడం లేదన్నారు. ఐదేళ్లు దూరం పెట్టి మారేందుకు అవకాశం ఇచ్చినా ఈటెలలో మార్పు రాలేదన్నారు.  ఈటెలకు కేసీఆర్ కు గ్యాప్ ఉన్నా మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిన ఘనత ఈటెలకు కేసీఆర్ కట్టబెట్టారన్నారు.  బీజేపీ భూ స్థాపితం అవుతుందని అన్న ఈటెల.. ఎందుకు బీజేపీలో చేరుతున్నారని ప్రశ్నించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈటెల పాత్ర ఏంటో చెప్పాలి? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ను గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తించేసుకోవాలన్నారు. ఈటెల వ్యక్తిగతంగా జరిగిన తప్పును నిరూపించుకోలేక ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని చెప్పారు. ఈటెల బీజేపీలో చేరి పెట్రోల్-డీజిల్ తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయస్థాయి ప్రాజెక్టు రప్పిస్తారా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు.

కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి ఈటెల సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ లో కురుక్షేత్ర యుద్ధంలో జరగబోతోందన్నారు. తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న కొన‌సాగుతోందని, కేసీఆర్ అసలు రాజ్యాంగం, ఎమ్మెల్యేలు ఎందుకు అనే భావనలో ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్లు రావని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి తనకు ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీ బీఫాం ఇచ్చి ఉండొచ్చు కానీ, తాను గెలుస్తున్న‌ది మాత్రం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతోనేని స్పష్టం చేశారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ టీఆర్ఎస్ గెలుస్తోందని ఈటల వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు ఈటలకు కౌంటర్ ఇస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రగతి భవన్ వెకిలి చేష్టలు మానుకో: కేసీఆర్ కు ఈటల హెచ్చరిక

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News