Friday, April 26, 2024

చదువుకున్న అందరికీ సర్కారు నౌకరి రాదు.. హమాలీ పని ఉపాధి కాదా..?

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివాదస్పద కామెంట్స్ చేశారు. చదువుకున్న అందరికీ సర్కారు నౌకరి రాదని మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడటం వివాదస్పదయింది… అంతేకాదు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ పని ఉపాధి కాదా..? అంటూ ప్రశ్నించారు.. హమాలీ పనికంటే మించిన ఉపాధి ఏముంది తెలంగాణలో అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కాగా, కొత్త జోన్లు, కొత్త జిల్లాల ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల కేబినెట్‌ సమావేశం నిర్వహించి.. దీనిపై ఫోకస్‌ పెట్టారు సీఎం కేసీఆర్‌.. ఈ తరుణంలో మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలు చర్చగా మారాయి. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్న పాలకులు.. మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.. అయితే, ఈ తరుణంలో సర్కార్‌ కొలువులపై మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రధాన్యతలను సంతరించుకున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: హింసించే భార్యపై కేసు నమోదు చేయవచ్చు: ఢిల్లీ హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement