Sunday, December 8, 2024

TG | రాజన్న సన్నిధిలో మంత్రి పొన్నం, విప్ ఆది, మాజీ మంత్రి కనుమూరి ప్రత్యేక పూజలు

వేములవాడ, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా విరాజుల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దంపతులు సోమవారం రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడలో శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు మంత్రి పొన్నo ప్రభాకర్ ఆలయ ప్రాంగణంలోకి రాగానే పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు పూల మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం మహా మంటపంలో ప్రముఖులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించి స్వామివారి చిత్రపటం మహా ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. వారి వెంట ఆలయ అర్చకులు, అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement