Tuesday, March 26, 2024

పంట మార్పిడికి ప్రోత్సాహకాలు ఎక్కడ?: కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ప్రభుత్వ తీరుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని అన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఒకటి చెబుతుంటే తెలంగాణ బీజేపీ నేతలు మరొకటి చెబుతున్నారని విమర్శించారు. గతంలో రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయని గుర్తు చేశారు. మూడు నల్ల చట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతున్నదన్న మంత్రి.. రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందని హెచ్చరించారు. వంట నూనెల దిగుమతి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశంలో నూనెగింజల ఉత్పత్తికి ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పంట మార్పిడికి అవసరమైన ప్రోత్సాహకం అందించట్లేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పంట మార్పిడికి కేంద్రమే ఒక విధానాన్ని ప్రకటించించాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Dalitha Bandhu: దళితబంధ పథకానికి నిధులు విడుదల!

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement