Monday, January 30, 2023

రేపు ఆదిలాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రితో పాటు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళుతున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా జైనత్‌ మండలం దీపాయిగూడకుచేరుకుని ఎమ్మెల్యే జోగురామన్నను పరామర్శిస్తారు.

ఇటీవల జోగురామన్న మాతృమూర్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణంలోని బీడీఎస్‌టీ డేటా సొల్యూషన్‌ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడతారు. అక్కడి నుంచి నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శిస్తారు. ఇక్కడి విద్యార్థులతో కేటీఆర్‌ ముఖాముఖి భేటీ అవుతారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ తిరిగి రానున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement