Monday, July 26, 2021

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు.. పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇళ్లు!

పేదలకోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని తెలిపారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో రూ. 10.56 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పైసా ఖర్చు లేకుండానే పేదలకు తమ ప్రభుత్వం ఇళ్లను కట్టిస్తోందని చెప్పారు. నిరుపేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, చాలా పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. నిరుపేదల ముఖాల్లో సంతోషాన్ని చూడటమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం లేదు. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News