Friday, April 19, 2024

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శిచారు. ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ మంత్రుల సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి విద్యార్థులకు లాప్ టాప్ లు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి గతంలో ఇచ్చిన హామీల అమలుపై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు. మెస్ కాంట్రాక్టర్లను మార్చక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత మంది మంత్రులు, అధికారులు ఉండి కాంట్రాక్టర్లను మార్చకపోవడం ఏమిటని వీసీ ని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. నాణ్యమైన భోజనం అందించకపోతే మనమంతా ఉన్నదెందుకని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని, ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయండని ఆదేశించారు. టి.హబ్ ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని ,తాను మళ్లీ వస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement