Saturday, April 20, 2024

కేంద్ర వైఖ‌రితో యాసంగి ధాన్యం కొనలేం

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిసిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఆదివారం సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వ వైఖ‌రి వ‌ల్ల యాసంగి ధాన్యం కొనే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినా వారి వైఖ‌రిలో మార్పులేద‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.  రైతులు ఇబ్బందులు ప‌డొద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ప్రత్యామ్నాయ పంట‌లు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తుందన్నారు. వ‌రికి బ‌దులు వేరు శ‌న‌గ‌, సోయా లాంటి ఇత‌ర వాణిజ్య పంట‌ల‌ను సాగు చేయాల‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement