Friday, April 19, 2024

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న.. మంత్రి హరీష్ రావు

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని బుధవారం రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు వేదమంత్రోత్సవాలతో మంత్రికి ఘనంగా ఆశీర్వాదం అందజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు కృష్ణా రావు, సుదర్శన్, జనగాం శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement