Friday, May 20, 2022

రెండున్నర కోట్లతో రోడ్ల మరమ్మతులు: మంత్రి గంగుల

కరీంనగర్ నుండి రుక్మాపూర్ వరకు ఏడున్నర కీలోమీటర్ల బీటీ రోడ్ లేయర్ పనులను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షాల కారణంగా దెబ్బతిన్న ఈ రోడ్డు పనులను.. రెండున్నర కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న అన్ని రోడ్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ వై. సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement