Friday, March 29, 2024

రేషన్ షాపుల డిజిటలీకరణ వేగవంతం: మంత్రి గంగుల ఆదేశం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,500ల రేషన్ షాపుల్ని డిజిటలీకరించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబందించి సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, టెక్నాలజీ ప్రొవైడర్లతో మంత్రి గంగుల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆధునాతన టెక్నాలజీతో కూడిన ఈ పాస్ యంత్రాలు, ఎలక్ట్రానిక్  వేయింగ్ మెషిన్ల అనుసందానం, వాటి స్టాంపింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని డిపార్మెంట్లు సమన్వయంతో పనిచేసి పూర్తి చేయాలన్నారు. వినియోగదారులకు, రేషన్ సరుకులు తీసుకునే 2 కోట్ల 87లక్షల పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్దీ చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రితో ఉన్నతాధికారులు ఈ నెలలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని 1545 షాపులను అనుసందానించే ప్రక్రియ పూర్తి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా విడుతల వారీగా జూన్ నెలాఖరు కల్లా అనుసందానిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ డీఎల్ఎమ్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అసిస్టెంట్ కంట్రోలర్లు, సీజీజీ డైరెక్టర్, పౌరసరఫరాల అధికారులు, విజన్ టెక్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement