Friday, April 26, 2024

కార్మికులకు డబుల్ బెడ్ ఇంఢ్లు.. దళిత బంధు అమలు

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని ఆటోనగర్ లో మేడే సందర్భంగా నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచి…పేదలకు పంచాలనే సంకల్పంతో సీఎం కేసిఆర్ ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలతో కార్మీక లోకాన్ని ఆదుకుంటే… కేంద్ర ప్రభుత్వం కార్మీక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మీకుల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. బీజేపి పాలిత ప్రాంతాల నుండి ఎంతో మంది కార్మీకులు ఉపాధి లేక వలస జీవులుగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకొని అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని అన్నారు. వివిద రంగల్లో ఉన్న పేద కార్మీకులకు నగరంలో డబుల్ బెడ్ రూంలలో అవకాశం కల్పించి, దళిత కార్మీకులకు దళిత బంధును ఇచ్చే విధంగా కృషి చేసి ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆటోనగర్ లో  కార్మికుల కోసం మంచి నీటి సౌకర్యం, సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం, రోడ్డు నిర్మాణం, డ్రైనేజి పనులు చేపడుతామని మంత్రి గంగుల మాటిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement