Friday, March 29, 2024

ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు

యాసంగి పంట విషయంలో ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా అమ్మపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రత్యామ్నాయ లాభసాటి వ్యవసాయం నూతన ఒరవడిని అనుసరించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటలను రైతులు వేసుకోవాలని సూచించారు వడ్లు కొనే పరిస్థితి రాష్ట్రంలో లేదన్న మంత్రి.. వరి ధాన్యం వేసుకొని రైతులు నష్టపోవద్దన్నారు. పామాయిల్ పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో తేమ శాతం పెరిగిందని, 150 ఎకరాల్లో పామాయిల్ ప్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఏకరానికి బిసిలకు 80 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన విత్తనాలను రైతులు వేసేట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement