Thursday, May 26, 2022

పశువుల దొడ్డిగా మారిన మిని పార్క్

రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో బాగంగా గ్రామ పంచాయతీ స్థలంలో మినీ పార్క్ ని ఏర్పాటు చేశారు. కానీ ఆ పార్క్ స్థలంలో ఒక్క మొక్క కూడా లేకపోగా ఆ స్థలం పశువుల దొడ్డి గా మారింది. ఇదంతా జరుగుతున్నా గ్రామపంచాయతీ అధికారులు, పాలకులు చూసి చడనట్టు వ్యవహరించటం విడ్డూరంగా ఉంది. దీనిపైన ఉన్నత అధికారులు కల్పించుకొని భూమి కబ్జా చేసి పశువుల దొడ్డి గా మార్చిన వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement