Tuesday, October 1, 2024

ఎఐఎంతో బిఆర్ఎస్ … నాకిది – మీకిది…..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటుకు మిత్రపక్షం ఎంఐఎంతో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి(భారాస) ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిందా? రెండు పార్టీల అగ్రనేతల నడుమ ఎన్నికల్లో పోటీ-పై లోతుగా చర్చలు జరిగాయా? ఎన్నికల్లోపోటీ-పై ఇరు పార్టీలు ఏ నిర్ణయానికి వచ్చాయి? వచ్చే శాసనసభ ఎన్నికల్లో 50 సీట్లకు తక్కువ కాకుండా తమ పార్టీ పోటీ-కి దిగుతుందని అసెంబ్లీ వేదికగా ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన ప్రకటనకు ఇంకా కట్టు-బడి ఉన్నారా? ఒకవేళ అదే జరిగితే ఎంఐఎం పోటీ-కి దిగుతున్న నియోజకవర్గాలేవీ? తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశంపై చర్చోపచర్చలు సాగుతుండగా హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎంఐఎంకు మద్దతు ఇవ్వడం వెనుక పెద్ద కథే నడించిందన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ భారాస అధినేత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి ముందు ఎంఐఎం అధినేత హైదరా బాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని ఆయనతో సుదీర్ఘ మంతనాలు సాగించినట్టు- రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఇరువురి అగ్రనేతల మధ్య ఎడతెగని మంతనాలు జరిగాయని సమాచారం. ఆ చర్చలు కొలిక్కి వచ్చాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టు- సీఎం కేసీఆర్‌ అధికారిక ప్రకటన చేశారని చెబుతున్నారు. నీకది.. నాకిది అన్నట్టు-గా సాగిన చర్చల సారాంశం రెండు పార్టీల నేతలకు ఆలస్యంగా తెలియడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
హైదరాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి స్థానం మజ్లిస్‌ ఖాతాలో పడింది. ఈ సీటు-లో అధికార పార్టీ భారాస పోటీ- చేయకుండా.. మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేసిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ తన నిర్ణయం ప్రకటించడం.. ఎంఐఎం నుంచి మీర్జా రెహమత్‌ బేగ్‌ నామినేషన్‌ వేయడం.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చకచకా జరిగిపోయా యి. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ.. ఈ ఎమ్మెల్సీ సీటు-ను మజ్లిస్‌కు ఇవ్వడం వెనుక రెండు పార్టీల మధ్య పెద్ద అవగాహన కుదిరిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం ఆ వివరాల చుట్టూనే ప్రధాన రాజకీయ పక్షాల నేతలు ఆసక్తికరంగా చర్చించుకుంటు-న్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ అసెంబ్లీ సీటు- తమకు వదిలివేయాలని, ఇక్కడ భారాస ఎవరినీ నిలబెట్టరాదని ఎంఐఎం అగ్రనేతలు భారాస ముఖ్య నేతల ద్వారా సీఎం కేసీఆర్‌, యువనేత కేటీ- రామారావుకు రెండు నెలల ముందే కబురు పంపినట్టు- తెలుస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో రెండు పార్టీలు హైదరాబాద్‌ పాత బస్తీలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటా పోటీ-గా అభ్యర్థులను నిలబెట్టారు. కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ- (ఫ్రెండ్లీ కాం-టె-స్ట్‌) జరిగింది. అయితే రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు పార్టీలు నువ్వా..? నేనా? అన్న తరహాలో తలపడ్డాయి. దీంతో హోరాహోరీ పోరు సాగింది. ఆ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి మీర్జా రెహమత్‌ బేగ్‌ పోటీ- చేసి ఓడిపోయారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ సీటు- చర్చకు రావడానికి కారణం మజ్లిస్‌ ఉడుంపట్టేనని తెలుస్తోంది. మజ్లిస్‌కే ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి రాజేంద్రనగర్‌ సీటు-ను భారాస కాపాడుకుందని సమాచారం. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలవడానికి అధికార పార్టీకి పూర్తి మెజారిటీ- ఉంది. అభ్యర్థి పోటీ-లో ఉంటే గెలుచుకునే అవకాశం ఉన్నా భారాస ఎమ్మెల్సీ సీటును మజ్లిస్‌కు వదిలేసింది. సీటు- గురించి రెండు పార్టీల మధ్య చర్చలు మొదలైన సమయంలో ఎంఐఎం ఓ ప్రతిపాదన చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం సీటు-ను తమకు వదిలి వేయాలని, బదులుగా ఎమ్మెల్సీ సీటు- వదులుకుంటామని మజ్లిస్‌ నేతలు చెప్పారంటు-న్నారు? ఆ ప్రతిపాదనకు భారాస నుంచి సానుకూల స్పందన రాలేదని, పైగా తామే ఎమ్మెల్సీ సీటు- వదులుకుంటాం.. రాజేంద్రనగర్‌ సీటు తమకు ఇవ్వండన్న సమాచారం ఎంఐఎం అగ్ర నేతలకు ఇచ్చినట్టు- చెబుతున్నారు. ఇందుకు మజ్లీస్‌ నేతలు అంగీకరించడం.. రాజేంద్రనగర్‌లో పోటీ-కి సిద్ధమైన మీర్జా రహమత్‌ బేగ్‌ను ఒప్పించి ఎమ్మెల్సీగా బరిలోకి దింపినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రహమత్‌ బేగ్‌ ఎంఐఎం నుంచి గత ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నుంచి పోటీ- చేసి ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీర్జా రెహమత్‌ బేగ్‌ ఏకగ్రీవం కావడం జరిగింది.

50 చోట్ల పోటీ- చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన అక్బరుద్దీన్‌
తెరవెనుక జరగిన ఈ ఎపిసోడ్‌ ఇప్పుడు బయటకు రావడంతో అధికార పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం విస్తరిస్తోన్నా.. తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన పరిస్థితి లేదు. ఇటీ-వల అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్‌ ఒవైసీ తెలంగాణ లో 50 చోట్ల పోటీ- చేస్తామని ప్రకటించారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏ నిర్ణయం తీసుకుంటు-ందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రాజేంద్రనగర్ సీటు- తరహాలోనే రెండు పార్టీలు సర్దుబాటు- చేసుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.

చక్రం తిప్పిన ఎంపీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారాస తరపున రాజేంద్రనగర్‌ నుంచి పోటీ-కి దిగాలని రంగం సిద్ధం చేసుకుంటు-న్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎంపీ ఎంఐఎంకు ఎమ్మెల్సీ సీటు- ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినట్టు- సమాచారం. భారాస చీఫ్‌ కేసీఆర్‌, మంత్రి కేటీ-ఆర్‌ను ఒప్పించడంలో సదరు ఎంపీ పావులు కదిపి రాజేంద్రనగర్‌ నుంచి అసెంబ్లీకి ఎంఐఎం పోటీ-కి రాకుండా చేసుకున్నారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement