Saturday, January 4, 2025

KHM | ఈనెల 28న బొమ్మ కళాశాలలో మెగా జాబ్ మేళా

బొమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో కే-టెల్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28న శనివారం ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ (మెగా జాబ్ మేళా) నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు గురువారం తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్ లో 2020 నుండి ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు బీటెక్, బీ.ఫార్మసీ, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు పాల్గొనవచ్చని తెలిపారు.

ఈనెల 28న ఉదయం 10గంటల నుండి బొమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు అర్హత కలిగిన విద్యార్ధులు వారి రెజ్యూమ్, జీరాక్స్ సర్టిఫికెట్లు, 2 ఫొటోలు తీసుకొని క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్ లో పాల్గొనే విద్యార్ధులు ఎంట్రీ ఫీజుగా రూ.200 చెల్లించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement