Thursday, April 25, 2024

ఎల్లుండి మెడిక‌ల్ అండ్ ఇంజ‌నీరింగ్ మెయిన్ ఎక్జామ్స్.. పకడ్బందీ ఏర్పాట్లు

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 21న నిర్వహించనున్న కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులంతా సమన్వయంతో వ్యవహరించాలన్నారు. జిల్లాలోని 14 కేంద్రాల్లో ఈనెల 21న కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌కు 6వేల మంది, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఒక పరీక్ష కేంద్రంలో 110 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.

ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న ఈ అడ్మిట్‌ కార్డుతోపాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొవిడ్‌ నిబంధనల ప్రకారం మాస్కులు, శానిటైజర్లు, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలన్నారు. మాస్కులులేని అభ్యర్థులను పరీక్షకు అనుమతించరని స్పష్టం చేశారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement