Tuesday, October 19, 2021

చిట్యాలలో కొనుగోలు కేంద్రం..

మెదక్‌ రూరల్‌ : మండలంలోని చిట్యాల గ్రామంలో మాచవరం సొసైటీ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సీతారామయ్య ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సీతారామయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపొవద్దని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచ్‌ వెంకటేష్‌, సంగాయిగుడి తాండ సర్పంచ్‌ రవి, జానకంపల్లి సర్పంచ్‌, నాయకులు సంగాయ్య, రైతులు తడితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News