Monday, March 20, 2023

అందరి ఆమోదంతోనే సమస్య పరిష్కారం : ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్పూర్ : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బృందావన్ టీచర్స్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్డు సమస్యను అందరి ఆమోదయోగ్యంతోనే పరిష్కరిస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ కాలనీలో పర్యటించారు. బృందావన్ టీచర్స్ కాలనీ అంతర్గత రహదారుల గుండా మురుగు నీటి కాలువ నిర్మించేందుకు అధికారులు నిర్ణయించగా, కాలనీ వాసులు ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు కాలనీ వాసులతో సమావేశమైన ఎమ్మెల్యే జీఎంఆర్ ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు త్వరలోనే సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. అనంతరం జయలక్ష్మినగర్ లో నిర్మిస్తున్న కట్ట మైసమ్మ దేవాలయం, రాఘవేంద్రకాలనీ ఎల్లమ్మ దేవాలయాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement