Saturday, April 20, 2024

చిరుతను బంధించిన ఫారెస్ట్ అధికారులు..

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గడ్డి పోతారం పారిశ్రామిక వాడలో చిరుత వచ్చిన విషయం తెలిసిందే. హెటీరో పరిశ్రమ ఆవరణలోకి చిరుత రావడంతో చిరుతను చూసిన పరిశ్రమ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారమివ్వడంతో ఫారెస్ట్ అధికారులు హెరిటో పరిశ్రమకు చేరుకొని చిరుతను బంధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు చిరుతను బంధించారు. అనంతరం డీఎఫ్ఓ శ్రీధర్ రావు మాట్లాడుతూ.. చిరుత రెస్క్యూ ఆపరేషన్ లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. మొత్తానికి రెస్క్యూ సక్సెస్ అయ్యిందన్నారు. చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత బోన్ లో ఎక్కించి జూకి తరలించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement