Sunday, April 11, 2021

దేహదారుఢ్యానికి క్రీడలు..

చేగుంట : దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్‌రావు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా చేగుంట మండలం అనంతసాగర్‌ శివారులోని పెద్దమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ టోర్నమెంట్‌లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన అన్నారు. గ్రామీణ క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన సందర్భాలు ఉన్నాయని రఘునందన్‌రావు వెళ్లడించారు. ఈ కార్యక్రమంలో యోగా, ఫెన్సింగ్‌ కోచ్‌ కరణం గణేష్ కుమార్‌, బిజేపి చేగుంట మండల అధ్యక్షులు చింతల భూపాల్‌, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్‌ గోవింద్‌కృష్ణ, నియోజకవర్గం మీడియా ఇంచార్జీ అంజనేయులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News