Monday, October 14, 2024

చాకలి ఐలమ్మ వారసులకు ఘన స్వాగతం పలికిన సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

  • ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సభాస్థలి వరకు భారీ ఊరేగింపు
  • ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
  • దారి పొడవున పూల వర్షంతో టపాకాయలు పేల్చిన శ్రేణులు

పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో నేడు చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద నుంచి సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో సభా ప్రాంగణానికి చాకలి ఐలమ్మ వారసులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. దారిపొడుపున వారికి ఘన స్వాగతం పలుకుతూ టపాకాయలు కాలుస్తూ పూల వర్షం కురిపించారు. కన్నుల పండుగగా చాకలి ఐలమ్మ వారసులను సభా ప్రాంగణానికి సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో యువసేన నాయకులు తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement