Saturday, April 20, 2024

వంద కోట్లతో టూరిజం స్పాట్ గా రంగనాయక సాగర్ : మంత్రి హ‌రీశ్ రావు

వంద కోట్లతో టూరిజం స్పాట్ గా రంగనాయక సాగర్ ను అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర‌ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పట్టణ పరిధి ఒకటవ వార్డ్ లింగారెడ్డిపల్లి గ్రామంలో, చిన్నకోడూర్ మండలంలోని చందల పూర్ గ్రామంలో జరుగుతున్న మహంకాళి అమ్మవారి ఉత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. నాడు కరువుతో అల్లడిన ప్రాంతం.. త్రాగునీటికె గోస పడ్డ మన ప్రాంతం నేడు కల్పతరువుగా, సాగు, త్రాగు నీరు ఇచ్చే ప్రాంతంగా అవిష్కృతమైందన్నారు. రైతులకు కరెంట్, నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ దేన‌న్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చామని..రైతు బంధు, రైతు బీమా ఇస్తూ రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపామన్నారు. మన సిద్దిపేట ప్రాంతం గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తూ.. ఒక వైపు సాగు, త్రాగు నీరు ఇస్తున్న రంగనాయక సాగర్ రాబోయే రోజుల్లో 100 కోట్లతో టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసుకోబోతున్నామ‌న్నారు. దేశ విదేశాల తరహాలో డెస్టినేషన్స్, హోటల్స్, వాటర్ హబ్ గా గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. చందల పూర్ గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నాం.. రంగనాయక స్వామి గుట్టకు సీసీ రోడ్డు, రూ.50 లక్షలతో రంగనాయక స్వామి, రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని, అన్ని వర్గాల పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చినమన్నారు.. లింగారెడ్డి పల్లి గ్రామానికి పట్టణ హంగులు వచ్చాయని, రాబోయే కొద్దీ రోజుల్లో నాలుగు వరసల రహదారి కాబోతోందన్నారు.. బట్టర్ ఫ్లై లైట్స్, మధ్యలో డివైడర్ చెట్లతో అద్భుతంగా చేసుకుంటామని చెప్పారు.. మహంకాళి అమ్మవారి దయతో అందరికి శుభం చేకూరాలని చెప్పారు.. గత రెండు సంవత్సరాల నుండి కరోనాతో ఉత్సవాలు జరుపుకోలేక పోయామ‌ని, ఈ సంవత్సరం గ్రామాల్లో అమ్మవారి ఉత్సవాలు పండగలా జరుపుకుంటున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపిపి మాణిక్య రెడ్డి, సూడా చైర్మన్ రవిందర్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement