Wednesday, April 24, 2024

వృద్దాప్య ఛాయలను దూరం చేసే రాగులు..

ఝరాసంఘం : ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది రకరకాల జూస్‌లు తాగుతుంటారు. మరికొందరు బటర్‌మిల్క్‌, లస్సీలు తాగుతుంటారు. అయితే కొంచెం ఆరోగ్యంపై శ్రద్ద ఉన్నవారు అంబలి కోసం బాగా తెలిసిన వారు మాత్రం రాగి అంబలిని తాగుతారు. అంబలిని మించిన హెల్త్‌డ్రింక్‌ మరొకటి లేదు. ఈ రాగి అంబలిని అందరు అన్ని కాలాల్లో తాగుతారు. అయితే వేసవి కాలంలో దీని వినియోగం చాలా ఉంటుంది. రాగులను సాధారణంగా మినుము, కంది, వేరుసెనగ వంటి పంటలలో అంతర్‌ పంటగా సాగు చేస్తారు. అప్పట్లో ఎక్కువగా పల్లె ప్రజలు రాగులను రొట్టెలుగా చేసుకొని తినేవారు. ఆధునిక యుగంలో రాగికి ఆదరణ కరువైందని చెప్పాలి. మంచి పోషక విలువలున్న రాగిని పక్కన పెట్టి ఇతర ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. రాగుల్లో ఎక్కువగా ఐరన్‌ ఉంటుంది. ఇది వ్యక్తి ఆరోగ్యానికి మంచి పోషకాలను అందజేస్తుంది. మరియు అంబలి సంగతి ఎందుకంటే ధాన్యాల్లో కేళ్ల రాగులు శ్రేస్టం. రాగులను మొత్తగా దంచిన పోడిని నీళ్లలో వేసి బాగా ఉడికించాలి. దారుగా జావకాసి తయారు చేసిన ఆహార పదార్థమే రాగి అంబలి. రాగి అంబలిలో రుచికోసం ఇష్టాన్ని బట్టి జీడిపప్పు, జాజికాయ, వేరు శనగ పప్పులు, పచ్చ కర్పూరం, కిస్‌మిస్‌లు వంటివి కలుపుకోవచ్చు. అసలు ఇవేవి కలుపుకోకుండా ఉంటేనే మంచిది. లేదా ఉప్పుకారం కొంచెం మోతాదులో మసాలను కూడా కలుపుకొని రాగి అంబలి తాగితే ఆకలి రుచిని కలిగిస్తుంది.
రాగుల్లో పోషక విలువలు..:
వేసవిలో ప్రతి రోజు రాగులతో చేసిన అంబలిని తీసుకుంటే ఐరన్‌శాతం పెరగడంతో పాటు శరీరానికి చల్లదనాన్ని పెంచుతుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి రాగుల్లోని ఐరన్‌ రక్తహీనత తగ్గడానికి దోహదపడుతుంది. రాగుల్లోని క్యాల్షియం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి. కండరాల మరమ్మతులకు అమోనియా ఆమ్లం ఎక్కువగా ఉండడంతో ఛర్మం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. వృద్దాప్యం దూరం చేసేందుకు రాగులను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పోషక లోపాన్ని దూరం చేస్తుంది. ఎదిగే పిల్లలకు, వృద్దులకు రాగులు ఎంతగానో ఉపయోగపడుతాయి. అధిక బరువును తగ్గించేందుకు రాగి అంబలిని తీసుకోవడం ఉత్తమం. రక్తపోటు, షుగర్‌ వ్యాధి ఉన్న వారు అంబలిని తాగితే నియంత్రణలోకి వస్తాయి. రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న వారు రాగి అంబలిని తాగితే రక్తం గడ్డకట్ట కుండా ఉంటుంది. నీరసంతో క్షీణించిన వారికి అమితమైన వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా ఉపయోగం. స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి ఉదయం రాగి అంబలి త్రాగడం శ్రేయస్కరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement