Thursday, February 2, 2023

ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే జీఎంఆర్‌

ప‌టాన్ చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం లకడారం గ్రామంలో 4 కోట్ల 22 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన నూతన గ్రామపంచాయతీ భవనం, కమ్యూనిటీ హాల్ భవనం, ప్రాథమిక పాఠశాల భవనం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదులు, బీటీ రోడ్డు ను ప్రారంభించారు. అనంతరం గ్రామ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జాతీయ రహదారి నుండి లకడారం గ్రామ కూడలి వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హాయంలో గ్రామీణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి, గురయ్యాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం.. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి నెల గ్రామపంచాయతీలకు నిధులు అందిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమలు, కార్పోరేట్ సంస్థలు అందించే సిఎస్ఆర్ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి, కెసిఆర్ కిట్ లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో హై మాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా, వెంటనే పది హైమాస్ట్ లైట్లను మంజూరు చేశారు. భవిష్యత్తులో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, స్థానిక ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement