Thursday, April 18, 2024

వెమ్ టెక్ ప్రారంభం తర్వాత రక్షణ రంగంలో అగ్రగామి : కేటీఆర్

1988లో వెమ్ టెక్ ప్రారంభించిన తరువాత రక్షణ రంగంలో అగ్రగామిగా ఉన్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్జ్ లో తొలి పరిశ్రమ వెమ్ ప్రాజెక్ట్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మన దేశంలోనే రక్షణ రంగ పరికరాలు తయారీ అవుతున్నాయన్నారు. దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్నామన్నారు.

మీరు కోరుకున్న విధంగా భూమి ఇచ్చామన్నారు. సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానిక జహీరాబాద్ వారికి ఇవ్వాలన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ పాటించాలన్నారు. పరిశ్రమ పర్యావరణ హితంగా ఉండాలన్నారు. 12,600 ఎకరాలు భూమి నిమ్జ్ కు కేటాయిస్తే ఇప్పటికి 3500 ఎకరాలె సేకరించామన్నారు. భూమి కోల్పోయిన రైతులకు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కు 50 శాతం సహకారం అందిస్తామని వెంకట్ రాజు చెప్పడం అభినందనీయమని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement