Thursday, April 25, 2024

వన్నె తగ్గని.. పెద్దబాడిశె !

మెదక్ : సాంకేతిక పరమైన విజ్ఞానం తో వడ్రంగి పనుల్లో కొత్త కొత్త విధానాలు చోటు చేసుకున్నప్పటికీ పనిమంతుడు ఉన్న ప్రాంతాల్లో మాత్రం వన్నె తగ్గకుండా పనిచేస్తుంది. ఇల్లు కట్టడం మొదలు నాగలి తయారు చేయడం వరకు తదితర పెద్దపెద్ద పనిముట్లు తయారు చేసేందుకు వడ్రంగులు వాడుకునే పెద్ద భాష పూర్వకాలం నుంచి బహుళ ప్రాచుర్యంలో ఉన్న విషయం తెలిసిందే కాలక్రమేణా కొత్తగా వడ్రంగి పని నేర్చుకునే వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకోవడంతో పెద్ద పాఠశాలతో పనులన్నీ మరుగున పని ఉనట్లుయింది…

సాంకేతికపరమైన విజ్ఞానంతో వడ్రంగి పనుల్లోనూ కొత్త కొత్త విధానాలు చోటు చేసుకున్నప్పటికీ పనిమంతులున్న ప్రాంతాల్లో మాత్రం పెద్ద బాడిశె వన్నె తగ్గకుండా పనిచేస్తుంది. ఇల్లు కట్టడం కోసం నాగలి తయారు చేయడం కోసం తయారు చేసేందుకు వడ్రంగులు వాడుకునే పెద్ద బాడిశె పూర్వ కాలం నుంచి బహుళ ప్రాచుర్యంలో ఉన్న విషయం తెలిసిందే. కాల క్రమేణా కొత్తగా వడ్రంగి పని నేర్చుకునేవారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకోవడంతో పెద్ద బాడీ లతో పనులన్నీ మరుగున పడినట్లయింది.కానీ గ్రామాల్లో ఇంక వినియోగంలో ఉన్న పురాతన పద్ధతులు. పెంకుటిల్లు ఉన్నవారికి మరమ్మతులు అవసరమైన చోట ఉన్నా చిన్నచిన్న రైతులకు వారి వారి అవసరాలు తీర్చేందుకు పెద్ద పెద్ద కర్రలు, దులాలు, మూల పకాడీలు,వంటి కలప సామానును సరిచేసేందుకు వడ్రంగి పనుల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులు వాటిని సరిచేసి కర్రలు వంకర్లు లేకుండా సరిచేసే వారు గత కొద్దిరోజులుగా ఈ బాడీశే మూలకు పడ్డదనుకున్నప్పటికి ఇంకా గ్రామాల్లో వడ్రంగి పనుల్లో ప్రవీణ్యమున్న వడ్రంగులు తమ వృత్తిని కాపాడుకునేందుకు పనిమంతులైన వారికి ప్రాధాన్యమొన్నటికి తగ్గదన్న భావనను తమ పనుల ద్వారా చాటుతున్నారు .అనేక గ్రామాల్లో వడ్రంగులు తమ పనులకోసం యంత్రాలనుఉపయోగిస్తున్నప్పటికి వాటికి తోడుగా సైజుకు లేని కలప(మూగకట్టే) ను వాడాల్సి వచ్చిన చోట ఇంకా పెద్ద బాడిశెలను ఉపయోగిస్తూనే ఉన్నారు. వాటితో పని సులువుగా పూర్తవడంతో పాటు ఒక క్రమపద్ధతిలో మందం కలిగిన పొడవాటి కర్రలు బోడిసెలు,వంకర్లు, లేకుండా సక్రమంగా ఉండేలా సరి చేస్తున్నారు. గ్రామాల్లో ఇంకా వాడుకలో ఉంటు బాడిశెల ప్రాధాన్యతను ఇంకా కాపాడుతున్నారు. ఇలాంటి వారిలో రామాయంపేట మండలం నందిగామ కు చెందిన వడ్ల రమేష్.అనే వడ్రంగి ఇప్పటికి తన వృత్తిని కాపాడుకుంటూ ప్రావీణ్యమున్న పనివారికి ప్రాధాన్యత తగ్గడంలేదంటూ నిరూపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement