Thursday, April 25, 2024

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ రాజర్షి షా

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుండి మే 4 వరకు నిర్వహించే పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరిక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం తన ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తూ ఇటీవల నిర్వహించిన పదవ తరగతి పరీక్షల మాదిరే అందరు అధికారులు పకడ్బందీగా సమన్వయంతో పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9.00 గంటల నుండి 12.30 గంటల వరకు, మధ్యాన్నం 2 .30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్ లలో పరీక్షలు జరుగుతాయని అన్నారు. జిల్లాలో పదవ తరగతికి సబంధించి 466 మంది విద్యార్థులు , ఇంటర్మీడియట్ కు సంబంధించి 969 మంది విద్యార్థులు ఓపెన్ పరీక్షలు రాయనున్నారని అన్నారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి (3) పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో మెదక్ లోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సాపూర్ , తూప్రాన్ లోని బాలుర జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలని అన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు (5) పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో మెదక్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నరసాపూర్ లోని జిల్లా పరిషద్ బాలిక ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తూప్రాన్ లోని జిల్లా పరిషద్ బాలుర ఉన్నత పాఠాశాలలని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం సి.సి.కెమెరా నిఘాలో పనిచేయాలని, బందోబస్తుకు ఒక మహిళా, ఒక పురుష కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయాలని అన్నారు.

పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీరు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. పోలీస్ బందోబస్తు తో ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు పంపిణీ చేయాలనీ, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలనీ, జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్.టి.సి అధికారులు షెడ్యూల్ ప్రకారం బస్సులు నడపాలని, పరీక్ష నిర్వహణ అనంతరం సమాధానపత్రాలను సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చెపట్టాలని ఆదేశించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ లను ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ అనుమతి లేదని, పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోవాలని, ఏమైనా సందేహాలుంటే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబరు 08542-295622 కు ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఇంటర్మీడియట్ సైన్స్ కు సంబంధించి ప్రాక్టికల్స్ మే 12 నుండి 19 వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్,పరీక్షల విభాగం,విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement