Monday, March 25, 2024

నూతన పద్దతిలో వరిసాగు..

మెదక్‌ : నూతన పద్దతి వల్లన వరిసాగు అలవర్చుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్‌ రైతులకు సూచించారు. మెదక్‌ మండలంలోని మాచవరం గ్రామంలో పరిపంటలను ఆయన పరిశీలించారు. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చులతో ఎక్కువ దిగుబడి పోందే విధంగా సాగుచేస్తున్న నూతన పద్దతులను ఆయన రైతులకు వివరించారు. అధిక లాభాలు పొందలంటే సాగుకు చదును చేసుకున్న పొలాల్లో విత్తనాలు వెదజల్లె పద్దతిలో ఒక ఎకరంకు 80-120 కిలోల విత్తనాలు సరిపోతుయాని, ఈ పద్దతిన రైతు ఒక ఎకరానికి రూ.2500 నుండి రూ.3000 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ విత్తుకొని కూలీల కొరతను అదిగమించవచ్చన్నారు. అంతేకాకుండా ఈ పద్దతిలో కాండం గట్టిగా ఉండి వ్యవస్థా ధృడంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓలు ప్రవీణ్‌, రెబర్‌సాన్‌, ఏఈఓ శరణ్య, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement