Sunday, April 14, 2024

నారాయణఖేడ్‌ లో లాక్‌డౌన్‌..


నారాయణఖేడ్‌ : రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్య నారాయణఖేడ్‌ పట్టణంలో మే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనా బేగం నజీవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నాడు మున్సిపల్‌ కార్యాలయంలో వైస్‌ చైర్మన్‌ పరుశరాం, కౌన్సిర్లు, కో ఆప్షన్‌ సభ్యలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 3 నుంచి 10 వరకు లాక్‌ డౌన్‌ నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. అత్యవసర సరుకులు, కూరగాయలు, పండ్లు,కిరణా దుకాణాలు, మాసం దుకాణాలు, ఫర్టిలైజర్‌ షాపులు ఉదయం 11గంటల వరకు నిర్వహించాలని వారు పేర్కొన్నారు. మెడికల్‌ షాపులు, పాల దుకాణాలు ఇందులో మినహాయింపు ఉంటుందన్నారు. 4, 11వ తేదీల్లో జరిగే మంగళవారం సంతని రద్దు చేశామన్నారు. దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చి చెప్పారు. తీర్మాణానికి వ్యతిరేకంగా షాపులు తెరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ హెచ్చరించారు. శుక్రవారం నాడు ఒక్క రోజే ఐదు మందికి మృత్యువాత పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. పట్టణంలో నిర్వహించే లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అలాగే నారాయణ షాపింగ్‌ మాల్‌లోప్రజలు గుంపుగుంపులుగా వచ్చి షాపింగ్‌ చేయడంతో షాపును సీజ్‌ చేశామన్నారు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌తో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement