Wednesday, April 24, 2024

మానవతకు మారుపేరు ఎమ్మెల్యే జీఎంఆర్… సొంత నిధుల‌తో టెన్త్ విద్యార్థుల‌కు అల్పాహారం…

ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే ప్రక్రియలో భాగంగా.. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యను అభ్యసిస్తూ ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 1947 మంది విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే జీఎంఆర్ రూ.15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి మరో మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. శనివారం పటాన్ చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణతా శాతం పెరిగించేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 75 రోజులపాటు అల్పాహారం అందించేందుకు 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కోటి రూపాయల అంచనా వ్యయంతో విద్యార్థులందరికీ ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. దీంతోపాటు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా 55 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు జెమిని కుమారి, విజయ, రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, బండి శంకర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement