Wednesday, September 27, 2023

26న చిట్కుల్ కు మంత్రి కేటీఆర్ రాక.. ఆహ్వానించిన తెరాస రాష్ట్ర నాయ‌కులు నీలం మ‌ధు

ప‌టాన్ చెరు : తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ సౌజన్యంతో చాకలి ఐలమ్మ జయంతి రోజున ఏర్పాటు చేస్తున్న చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ని ఆహ్వానించారు. హైదరాబాదులో బీఆర్కే భవన్ లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కూడా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 26వ తేదీన కచ్చితంగా ఐలమ్మ విగ్రహావిష్కరణకు వస్తానని మంత్రి కేటీఆర్, హరీష్ రావులు హామీ ఇచ్చారు. ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఈ విగ్రహావిష్కరణకు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, రాష్ట రజక సంఘం యూత్ అధ్యక్షుడు నల్లతీగల రాజు, రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదవూర బ్రహ్మయ్య, కార్యదర్శి చిట్కుల్ వెంకటేష్, సురేశ్ తో పాటు రాష్ట్ర రజక సంఘం నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement