Saturday, May 8, 2021

అంద‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోండిః మంత్రి హరీష్ రావు..

సిద్దిపేట: పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్‌లో హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అధికారులు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని, మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News