Friday, March 29, 2024

సిద్దిపేటలో రైల్వే ట్రాక్ పనులను పరిశీలించిన మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట : సిద్ధిపేట రంగదాంపల్లి రైల్వే స్టేషన్, దుద్దెడ – సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ రైల్వే ట్రాక్ లైన్ ను మంత్రి హ‌రీష్ రావు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప‌నులు నిర్వ‌హ‌ణ వివ‌రాలు అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వ‌ర‌గా ప‌నులు పూర్త‌య్యేలా చూడాల‌ని అధికారుల‌కు సూచించారు. ప‌నుల్లో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌కూడ‌ద‌న్నారు. మార్చిలోపు సిద్ధిపేటలో రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. దుద్దెడ-సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం పెంచాలని రైల్వే శాఖ అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. దుద్దెడ-సిద్ధిపేట రైల్వే ట్రాక్ పనులలో మందపల్లి వద్ద అండర్ పాస్, కుకునూరుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ జాప్యం పై ఆరా తీసి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. శ్రీ కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తుల రాక స్టేషన్ నిర్మాణం పై రైల్వే శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ తో మంత్రి హరీష్ రావు సమాలోచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement