Wednesday, April 14, 2021

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

రామాయంపేట : పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన రామాయంపేట మండల పరిధిలోని రాయిలాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయిలాపూర్‌ గ్రామానికి చెందిన ఎరుకల మహేష్‌ (30) కూలీపని చేసుకుంటూ జీవనం గడుపుతుంటాడు. రామాయంపేటలోని సిఎస్‌ఐ చర్చిగేటు దగ్గర పురుగుల మందు త్రాగగా వెంటనే రామాయంపేటలోని ప్రభుత్వవ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అతని అక్క పెంటవ్వ ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ ప్రతాప్‌ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News