Monday, March 25, 2024

ఏపీలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే.. తెలంగాణ 54 లక్షలు ఎకరాలు : మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట : ఈ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలలో వరిసాగు చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 16 లక్షల ఎకరాలు వరి సాగు చేశారని, సకాలంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు శ్రేయస్సుకై కృషితో ఇది సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట గ్రామీణ మండలం చిన్నగుండవెళ్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు.
చిన్నగుండవెళ్లి గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జెడ్పీటీసీ శ్రీహరి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డితో కలిసి రైతువేదిక, యోగ కేంద్రంను ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు అక్కడి ప్రజలు జొన్న, గట్క మక్క గట్క తప్ప ఏమీ తినలేదని, తానే అన్నం తినడం నేర్పనని టీడీపీ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వారి ధాన్యం నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ఆలోచనలతో అనేక సంక్షేమ పథకాలతో గొప్ప మార్పు వచ్చి అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చారు. ఆయిల్ ఫామ్ లాభదాయకమైన పంటగా వివరిస్తూ.. ఆయిల్ ఫామ్ సాగు కోసం బడ్జెట్ లో వెయ్యికోట్ల సబ్సిడీ కింద అందిస్తున్నామని, రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగుచేసే దిశగా అడుగులు వేయాలని కోరారు. రైతులకు మేలు చేకూర్చాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలకు ఏమని విమర్శించాలో.. అర్థం కాక, తెలియక సతమతమవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేయడం చేతగానీ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement