Friday, April 19, 2024

Medak | విద్యార్థుల నడుమ ఘనంగా హ‌రీశ్‌రావు బ‌ర్త్‌ డే వేడుకలు..

విద్యార్థుల న‌డుమ మంత్రి హ‌రీశ్‌రావు బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, అంతేకాకుండా సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని గురుకులంలో విద్యార్థినుల మధ్య మంత్రి హరీశ్‌ జన్మదినాన్ని నీలం మధు ముదిరాజ్ కేక్ కోసి సంబరాలు నిర్వహించారు.

మంత్రి హరీశ్‌ రావు ప్రభుత్వంలో ఏ శాఖ అప్పచెప్పినా సమర్థవంతంగా పనిచేస్తూ ఆ శాఖలకే వన్నెతెస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ప్రజలందరికీ వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని, కంటి వెలుగు నుండి ఎక్స్‌రే వంటి ఇతర సౌకర్యాలు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆర్థిక శాఖ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అంటే అది ఒక్క హరీష్ రావుకే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరింత పురోగతికి వచ్చేందుకు ఇలాంటి మంత్రి సేవలు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో EO కవిత, వార్డు సభ్యులు దుర్గయ్య,మురళీ,వెంకటేశ్, రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినిలు, NMR యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement