Saturday, April 20, 2024

హనుమాన్‌ ఆలయ వార్షికోత్సవం..

చిలప్‌చేడ్‌ : మండల కేంద్రమైన చిలప్‌చేడ్‌లో హనుమాన్‌ ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు గొట్టం దశరథ్‌ తెలిపారు. ఈ వార్షికోత్సవానికి రంగపేట పీఠాధిపతి మాధవానందస్వామి హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తీభావం కలిగి ఉండాలని సూచించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement