Friday, December 1, 2023

క్రీడల ద్వారా స్నేహపూర్వక వాతావరణం : ఎమ్మెల్యే జీఎంఆర్‌

పటాన్చెరు : ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికుల కోసం క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతగా నిలిచిన ఎంఆర్ఎఫ్, రన్నరప్ గా నిలిచిన ఓడిఎఫ్ జట్లకు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైత్రి మైదానం క్రీడలకు కేంద్రంగా నిలవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్విరాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement