సంగారెడ్డి : షార్ట్ సర్క్యూట్ తో లారీలో మంటలు చెలరేగిన ఘటన జిల్లాలోని హత్నూర మండలం సాధుల్ నగర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. వవరాల్లోకి వెళితే.. నగర్ గ్రామ శివారులోని రహదారిపై లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో లారీ మొత్తం రోడ్డుపైనే తగలబడిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ సమయానికి రాకపోవడంతో రోడ్డున పోయే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
- Advertisement -