Friday, April 19, 2024

ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మ‌హ‌త్య

పాపన్నపేట మండల పరిధిలోని ముద్దపూర్ గ్రామానికి చెందిన పిట్ల దుర్గయ్య (38) మిన్పూర్ దౌలాపూర్ ముద్దాపూర్ గ్రామాలకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. నిన్న ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి నుంచి దుర్గయ్య బయలుదేరి… నా గురించి వెతకకండి.. తెల్లారేసరికి శ‌వ‌మై క‌నిపిస్తాను అని చెప్పి వెళ్లాడు. చెప్పిన వెంటనే కుటుంబ సభ్యులు పోలీసుల సహాయంతో ఎంత వెతికిన ఆచూకీ దొరకలేదు. ఉదయం పల్లితాండ స్మశాన వాటిక అటవీ ప్రాంతంలో మృత‌దేహం క‌నిపించింది. ఇది చూసిన తండావాసులు ఇతను ముద్దాపురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గయ్య అని గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో దుర్గయ్య భార్య సుగుణ వారి కుటుంబ సభ్యులు, పోలీసులకు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి తొలగించడం వలన మానసిక బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement