Wednesday, April 24, 2024

Medak: వడ్లు కొనడం లేదని రోడ్డెక్కిన రైతులు

కౌడిపల్లి, మే 31, ప్రభ న్యూస్ : మండల కేంద్రమైన కౌడిపల్లిలోని రేణుక మాత ఆలయం సమీపాన మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై వడ్ల కొనుగోలు జరగడం లేదని రైతులు బుధవారం రోజున రాస్తారోకో నిర్వహించారు. ఒక గంట పాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరుప్రక్కల కిలోమీటర్ వరకు వాహనాలు ఆగిపోయాయి. గత 15రోజుల నుండి లారీలు రాకపోవడంతో ఇప్పటికే రెండు లారీల వరి ధాన్యం గోనెసంచుల్లో ఉండిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి ధర్నా వద్దకు చేరుకొని ఎమ్మార్వో కమలాద్రికి సమాచారమిచ్చారు. త‌హ‌సిల్దార్ కమలాద్రి రైతులతో మాట్లాడుతూ.. వడ్లు డంపు చేయడానికి గోదాం తీసుకోవడం జరిగిందని, నేటి నుండి వెనివెంటనే కొనుగోలు చేయడం జరుగుతుందని, అలాగే లారీలు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు బీజేపీ నాయకులు రాజేందర్, రాకేష్, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement