Wednesday, April 24, 2024

కంటి వెలుగు శిబిరాలను ప్రాపర్ గా నిర్వహించాలి : సంగారెడ్డి కలెక్టర్ శరత్

కంటి వెలుగు శిబిరాలను ప్లానింగ్ తో ప్రాపర్ గా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో డీఎల్ పీవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, మండల అధికారులు, మెడికల్ ఆఫీసర్ లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఏపిఎంలు, మున్సిపల్ కమీషనర్లు తదితరులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను ప్రాపర్ గా నిర్వహించాలన్నారు. మైక్రో ప్లాన్ పక్కాగా చేసుకుని మొబ లైజేషన్ చేయాలని, ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కంటి వెలుగు టీమ్స్ ఎక్కడ ఉంటున్నారన్నది పరిశీలించాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విధిగా పని చేస్తున్న గ్రామంలో ఉండాలని స్పష్టం చేశారు. రాయికోడ్ కంటి వెలుగు బృందం 117 శాతం స్క్రీనింగ్ చేసినందుకు సంబంధిత బృందం సభ్యులందరినీ కలెక్టర్ అభినందించారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో 85 శాతం కన్నా తక్కువ ప్రసవాలు ఉండరాదన్నారు. వంద శాతం ఇమ్యునైజేషన్ జరగాలని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలలో వంద శాతం పన్ను వసూలు పూర్తి కావాలని ఎం పీఓలకు ఆదేశించారు. కనీసం 50 శాతం లేబర్ మొబ లైజేషన్ చేయాల్సిన బాధ్యత ఎంపీడీవో, ఎంపీఓలదని స్పష్టం చేశారు.ఈజీఎస్ జాబ్ కార్డ్స్ కు ఆధార్ సీడింగ్ జరగాలని తెలిపారు. ఈనెలాఖరి లోగా వంద శాతం బ్యాంకు లింకేజీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెత్త అమ్మకంతో గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరాలని తెలిపారు. ప్లాంటేషన్ కు రెగ్యులర్గా వాటరింగ్ చేయాలని ఆదేశించారు. వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు బోర్డు, గేటు, మూడు వరసల చుట్టూ ప్లాంటేషన్ ఉండాలని తెలిపారు. కబడ్డీ, కోకో, వాలీబాల్ కోర్ట్ ,లాంగ్ జంప్ ఫిట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ పోల్స్ విధిగా ఉండాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు ఆయా విషయాలలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్రీడా ప్రాంగణాలు చేసిన చోట పక్కాగా చేయాలని సూచించారు. సమీకృత మార్కెట్ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. మహా ప్రస్థానం, క్రీడా ప్రాంగణాలు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తో చేపట్టిన పనులు షెడ్యూల్ మేరకు పూర్తి చేసేలా దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. 75 శాతంకు పైగా పన్ను వసూలు చేసిన వట్టిపల్లి, హత్నూర, కోహిర్, నారాయణఖేడ్ ఎంపీఓ లను పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement