Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోళ్లు..

రబీ ధాన్యం కొనుగోళ్లు ఉంటాయా..? ఉండయా..? అనే ఆయోమయంలో ఉన్న రైతులకు ఇటీవల సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. గ్రామాల్లో ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించడంతో రైతులు ఊపిరి పీల్పుకున్నారు. ఆయన ఆదేశాలతో జిల్లాలో ఈనెల రెండోవారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. గత అనుభావాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ట్రాన్స్‌పోర్టింగ్‌, గన్నీ కొరత, తదితరాలు దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం సీఎస్‌ సోమేస్‌ కుమార్‌ కలెక్టర్‌, ఆదనపు కలెక్టర్లు, పౌర సరఫరాలు, సహకార, గ్రామీణ అభివృద్ది శాఖ, డీసీఎమ్మెస్‌ అధికారులతో ఇప్పటికే వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు.

జోగిపేట :
యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లాలో వరి సాగు, దిగుబడి అంచనాల ప్రకారం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు పూర్తిమ చేస్తున్నారు. ఈ మేరకు మరో వారం రోజుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్‌ సమావేశం ఉంటుందని తెలిసింది. కొద్ది రోజుల్లో యాసంగి వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యాన ముందస్తుగా యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేసిన అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇందులో భాగంగా ఆరు జిల్లాల్లో ధాన్యం దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించగా, అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ పలు సూచనలు చేయనున్నట్లు తెలిసింది.
అంచనాలకు మించి వరి సాగు..
ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లాల్లో రైతులు పంట పోలాల్లో 81 వేల, 569 ఎకరాల్లో వరి సాగు చేశారని అధికారులు తెలిపారు. ఇందులో లక్షల్లో మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయం, కొందరు రైతులు విత్తనాల కోసం నిల్వ చేసుకునే సరుకు పోను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం 127 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదించారని తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లపై సందిగ్ధత నెలకొంది. కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని, గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో రైతులు తమకు ఇష్టం వచ్చినచోట విక్రయించుకోవాలనే ప్రచారం సాగింది. ఇప్పటివరకు పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), సహకార శాఖ, డీసీఎంఎస్‌ ద్వారా ధాన్యం సేకరిస్తూ వస్తున్నారు. ఈ సారి మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే అం శాన్ని పరిశీలిస్తుందన్న ప్రచారం రైతులను అయోమయోనికి గురిచేసింది. ఎట్టకేలకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సేకరణకు ఏర్పాట్లు చేస్తుండటంతో రైతుల్లో హార్షం వ్యక్తమవుతోంది.
యాసంగిలో భారీ దిగుబడులు వచ్చే అవకాశం..
సంగారెడ్డి జిల్లాలో సింగూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఉండడంతో సిం గూరు కింద ఉన్న చెరువులు, కుంటలకు నీళ్లు చేరుకోవడం, భారీ వర్షాలు, జలాశయాల్లో నీటి నిల్వతో భూగర్భజలాలు పెరిగి సాగుకు ఊతమిచ్చాయి. ఈ యాసంగిలో వరి సాగు 81 వేల 569 ఎకరాలు వరి వేశారు. ఈ సీజన్‌లో 1,78,000 టన్నుల వరి ధాన్యాని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏ గ్రేడ్‌ క్వింటాల్‌కు రూ. 1, 888, కామన్‌ రకానికి రూ. 1, 868 చొప్పున మద్దతు ధర చెల్లించనున్నారు. కాగా గత యాసంగిలో సొసైటి ద్వారా 54, ఐకేపీ పరిధిలో 69 మొత్తం 123 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. ఈ యాసంగి సీజల్లో సాగు పెరిగినందున్న మరిన్ని కేంద్రాలు ఏర్పటు చేస్తారా అనేది సందిగ్ధత నెలకొంది. ఏదేమైనప్పటికీ యాసంగి సీజన్లో రైతులు పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేశారు. చెరువులు, కుంటల ద్వారా సాగు కోసం నీళ్లను వాడుకుంటున్నారు. అంచనాలకు మించి ఈ యాసంగి సిజల్లో వరి సాగు చేశారు.
గన్నీ బ్యాగులు, యంత్రాలు ఏర్పాట్లపై యాంత్రాంగం..
మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలకు తగ్గట్లుగా ప్యాడీ క్లీనర్లు, తూకం కొలిచే యంత్రాలు సమకూర్చనున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో గోనె సంచులు గన్నీ బ్యాగులు నిర్ణీత సమయంలోగా అందజేయనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచుటకు గాను వ్యవసాయ మార్కెట్ల గోదాంలను వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement